Skip to main content

Namaste NRI

పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం

పొరుగు దేశం పాకిస్తాన్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఉత్తర వజీరిస్తాన్‌లో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతిచెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. చార్టర్డ్ విమానం ఆయిల్ కంపెనీకి చెందిన ఉద్యోగులను తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.  హెలికాప్టర్‌ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ ఫెయిల్ అయింది. పైలట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే హెలికాప్టర్ కుప్పకూలింది. మరణించిన వారిలో ముగ్గురు రష్యా జాతీయులు, ఇద్దరు పైలట్లు, ఒక క్రూ మెంబర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికార సమాచారం తెలియాల్సి ఉంది.

Social Share Spread Message

Latest News