Skip to main content

Namaste NRI

ఫెమినా మిస్ ఇండియాగా కర్ణాటక యువతి

ఫెమినా మిస్ ఇండియా 2022 కిరీటాన్ని దక్కించుకుంది కర్ణాటకకు చెందిన సినిశెట్టి. 58వ ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీని ముంబైలో నిర్వహించారు. ఫైనాల్స్ లో మిస్ ఇండియా 2022 విజేతగా సినిశెట్టిని ప్రకటించారు నిర్వాహకులు. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి చేతుల మీదుగా సినీ శెట్టి కిరీటాన్ని అందుకున్నారు. సినీ శెట్టి కర్ణాటకలో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం CFA అనే కోర్సు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ వరల్డ్ పోటీలో పాల్గోనున్నారు సినిశెట్టి.  అలాగే రాజస్థాన్ కు చెందిన రూబల్ షెకావత్ రెండో రన్నరప్ గా నిలిచారు.  , యూపీకి చెందిన షినాటా చౌహాన్ సెకండ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు. ఫెమినా మిస్ ఇండియా ప్యానెల్‌లో న‌టులు నేహా దూపియా, డీనో మోరియా, మ‌లైకా ఆరోరా, డిజైన‌ర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖ‌న్నా, కొరియోగ్రాఫ‌ర్ షియామ‌క్ దావార్‌, క్రికెట‌ర్ మిథాలీ రాజ్‌లు ఉన్నారు.

Social Share Spread Message

Latest News