Skip to main content

Namaste NRI

ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు గట్టి షాకిచ్చాడు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులంతా ఆఫీసుకు రావలసిందేనని, లేదంటే ఉద్యోగాలు ఊడతాయని తేల్చి చెప్పేసిన మస్క్‌ తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన కంపెనీలో కొత్తగా ఎవర్నీ చేర్చుకోకుండా హైరింగ్‌ ఆపేసినట్లు ప్రకటించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏదో చెడు జరుగుతుందనే బ్యాడ్‌ ఫీలింగ్‌ ఉందని, అందుకే కంపెనీ ఉద్యోగుల్లో పది శాతం కోత విధించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా హైరింగ్‌ ఆపేయండి అనే టైటిల్‌తో ఎగ్జిక్యూటివ్స్‌ అందరికీ ఒక మెయిల్‌ వెళ్లినట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News