నిఖిల్ హీరోగా నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా స్వయంభూ. భరత్ కృష్ణమాచార్య దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలు. ఇందులో నిఖిల్ యుద్ధవీరుడిగా కనిపించ నున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. కండలు తిరిగిన యోధుడిగా మేకోవర్ అయిన నిఖిల్ స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ పాత్రకోసం మార్షల్ ఆర్ట్స్, గుర్రపుస్వారీలతోపాటు పలు ఆయుధా లాను ఉపయోగించే రీతుల్లో కూడా నిఖిల్ శిక్షణ తీసుకున్నట్టు మేకర్స్ చెబుతున్నారు.

అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నట్టు ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. వియత్నామీస్ ఫైటర్స్‌తో సహా 700మంది ఆర్టిస్టులు ఈ ఎపిసోడ్‌లో భాగం కానున్నారని, 12 రోజుల పాటు చిత్రీకరణ జరిగే ఈ యాక్షన్ ఎసిసోడ్‌ని హాలీవుడ్ స్థాయిలో దర్శకుడు భరత్‌కృష్ణమాచార్య డిజైన్ చేశారని మేకర్స్ చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రెండు భారీ సెట్లలో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కించనున్నాం. 8కోట్ల నిర్మాణవ్యయంతో రూపొందుతోన్న ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానున్నది. బిగ్ స్క్రీన్‌పై ఈ ఎపిసోడ్ ఒక విజువల్ ఫీస్ట్ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఠాగూర్ మధు.
