భారత యువతకు జారీ చేసే స్టడీ పర్మిట్ల సంఖ్యలో కెనడా కోతలు విధిస్తున్నది. ఆ దేశ వలస, కాందిశీకుల, పౌరసత్వ సంస్థ(ఐర్‌సీసీ) ప్రకారం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేవలం 30,640 మంది భారత విద్యార్థులకు మాత్రమే స్టడీ పర్మిట్లను జారీ చేశారు.

గత ఏడాదితో పోల్చితే స్టడీ పర్మిట్ల సంఖ్యలో 31 శాతం తగ్గుదల కనిపించింది. తమ దేశ ప్రజలకు, వలసదారులకు, విదేశీ విద్యార్థులందరికీ గృహ వసతి, ఆరోగ్య, రవాణా కల్పించడంలో ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని కారణంగా చూపిస్తూ స్టడీ పర్మిట్ల జారీని కెనడా ప్రభుత్వం తగ్గిస్తూ వస్తున్నది.
