Skip to main content

Namaste NRI

ఈ నిషేధం తక్షణమే అమల్లోకి…డొనాల్డ్‌ ట్రంప్‌

ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో షాకిచ్చారు. ఇప్పటికే యూనివర్సిటీకి ఫెడరల్‌ నిధుల్లో కోత పెట్టిన ట్రంప్‌,  తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై నిషేధం విధించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ యూనివర్సిటీకి లేఖ రాశారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని అందు లో పేర్కొన్నారు. దీంతో ఇకపై హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో కొత్తగా విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు నిలిచిపోనున్నారు. ఇప్పటికే వర్సిటీలో చదవుతున్న విదేశీ విద్యార్థులు మరొక విశ్వవిద్యాలయానికి బదిలీ కావడమో లేదా దేశం విడిచి వెళ్లడం చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది చేయకపోయినా చట్టపరమైన చర్యలు ఉంటాయని నోయెమ్ హెచ్చరించారు.

దీంతోపాటు విదేశీ విద్యార్థులు వీసాలు, అమెరికాలో చదువుకోవడానికి ప్రవేశం పొందే వ్యవస్థ అయిన యూనివర్సిటీ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. ట్రంప్‌ సర్కార్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో భారతీయ విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది.

Social Share Spread Message

Latest News