Skip to main content

Namaste NRI

ఆపిల్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌ .. యూఎస్‌లో ఉత్పత్తి చేయకపోతే  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆపిల్‌ కంపెనీకి వార్నింగ్‌ ఇచ్చారు. అమెరికాలోనే ఫోన్లను తయారు చేయాలని చెప్పారు. భారత్‌ లేదంటే అమెరికా వెలుపల ఉత్పత్తి చేసే చాలా ఖరీదైందవుతుందని పేర్కొంది. ఆపిల్‌ ఉత్పత్తులపై 25శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. జూన్‌ ఒకటి నుంచి యూరోపియన్‌ యూనియన్‌పై నేరుగా 50శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో యూఎస్‌ ఫ్యూచర్స్‌, ప్రపంచ మార్కెట్‌లో నష్టాలు కనిపించాయి. యునైటెడ్‌ స్టేట్స్‌లో విక్రయించే ఐఫోన్లను భారత్‌, ఇతర దేశాల్లో కాకుండా అమెరికాలో తయారు చేయాలని ఆశిస్తున్నట్లుగా టిమ్‌ కుక్‌తో చాలాకాలం కిత్రం చెప్పాను. ఇది జరుగకపోతే ఆపిల్‌ అమెరికాకు కనీసం 25శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది వార్నింగ్‌ ఇచ్చారు. బెదిరింపుల నేపథ్యంలో ఐఫోన్‌ ధరలు పెరిగే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. దాంతో ఆపిల్‌ అమ్మకాలు దెబ్బతినడంతో పాటు లాభాలు తగ్గే అవకాశం ఉంది. 

Social Share Spread Message

Latest News