Skip to main content

Namaste NRI

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభం  

కార్తీక్‌రాజు  కథానాయకుడిగా కొత్త చిత్రం ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభించారు.  కాజల్‌ చౌదరి కథానాయిక. రాజా దుస్సా దర్శకత్వంలో గాలి కృష్ణ నిర్మిస్తున్నారు.   తొలి షాట్‌కు సురేశ్‌బాబు క్లాప్‌ ఇచ్చారు. హీరో చైతన్య కెమెరా స్విచ్చాన్‌ చేశారు. భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి అట్లాస్‌ సైకిల్‌ అత్తగారు పెట్లే అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 1980ల్లో వరంగల్‌లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు తెలిపారు.

Social Share Spread Message

Latest News