Skip to main content

Namaste NRI

తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా థాంక్యూ డియర్ ఫస్ట్ లుక్ లాంచ్

యువ హీరో ధనుష్‌ రఘుముద్రి, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ థ్యాంక్యూ డియర్‌. తోట శ్రీకాంత్‌కుమార్‌ దర్శకుడు. పప్పు బాలాజీరెడ్డి నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచింగ్‌ ఘనంగా జరిగింది. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ ఈ ఫస్ట్‌లుక్‌ని లాంచ్‌ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమా తన కెరీర్‌కి చాలా కీలకమని, ప్రేక్షకులకు సినిమా తప్పక నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నామని హీరో ధనుష్‌ రఘుముద్రి అన్నారు.

హీరో ధనుష్‌కి సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని నిర్మాత పప్పు బాలాజీరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. యువతరం మెచ్చేలా సినిమా ఉంటుందని లైన్‌ ప్రొడ్యూసర్‌ పునీత్‌రెడ్డి తెలిపారు. రేఖా నిరోషా, వీరశంకర్‌, నాగ మహేశ్‌, రవిప్రకాష్‌, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.ఎల్‌.కె.రెడ్డి, సంగీతం: సుభాష్‌ ఆనంద్‌.

Social Share Spread Message

Latest News