Namaste NRI

అల్లరి నరేష్ ఉగ్రం టీజర్ వచ్చేసింది

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ఉగ్ర. మిర్నా నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను  హీరో నాగ చైతన్య విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగ చైతన్య  మాట్లాడుతూ ఈ చిత్ర టీజర్ ఆకట్టుకుంది. నరేష్ ఇలాంటి ఇంటెన్స్ పాత్రల్లో నటించడం బాగుంది. నరేష్, దర్శకుడు విజయ్ కాంబినేషన్ ఒక బ్రాండ్‌లా మారిపోయింది. వీరు కలిసి మరిన్ని సినిమాలు చేయాలి. మంచి క్వాలిటీతో సినిమా చేసినట్లు కనిపిస్తున్నది  అన్నారు.

దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నాంది నిరూపించింది. ఈ సినిమా కూడా అంతే కమిట్‌మెంట్‌తో  రూపొందించాం. హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ కుటుంబం జోలికి వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తున్నాం. నరేష్ నటనతో మా కథలోని భావోద్వేగాలు మరింత బలంగా మారాయి  అన్నారు. రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిచ్చే చిత్రమిది. సినిమా చూస్తున్నంతసేపు మీకు ఆనందం, కన్నీళ్లు, కోపం వస్తాయి. ఈ చిత్రానికి మాటలు రాయడాన్ని ఆస్వాదించాను  అన్నారు. హీరో నరేష్ మాట్లాడుతూ నాకు ఇష్టమైన వ్యక్తి నాగ చైతన్య చేతుల మీదుగా మా సినిమా టీజర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. నటుడిని దర్శకుడు నమ్మితే మంచి సినిమాలు వస్తాయి. అలా నన్ను నమ్మిన దర్శకుల్లో మా నాన్న ఈవీవీ, క్రిష్, సముద్రఖని, విజయ్ ఉంటారు. విజయ్‌తో  మరిన్ని సినిమాలు చేస్తాను. మా గత చిత్రానికి బడ్జెట్ పరిమితులు ఉండేవి. కానీ ఈ చిత్రానికి కావాల్సినంత ఖర్చు పెట్టారు నిర్మాతలు. ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.  శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. త్వరలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News