Skip to main content

Namaste NRI

జవాన్ లో అల్లు అర్జున్‌?

షారుఖ్  హీరోగా నటించిన సినిమా జవాన్. అట్లీ దర్శకత్వం. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నయనతార ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్ పాత్ర పోషించనుంది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు.  ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా తాజాగా ఈ సినిమాలో ఓ స్టార్ హీరో గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు బాలీవుడ్ గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇంతకీ ఎవరా స్టార్ హీరో అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ జవాన్‌లో  గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు టాక్. ఇప్పటికే అట్లీ, అల్లు అర్జున్‌ను కలిసి తన రోల్ గురించి చెప్పాడట. బన్నీకి పాత్ర నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్‌పై  షారుఖ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 2న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News