అడివి శేష్ హీరోగా, శ్రుతి హాసన్ హీరోయిన్‌గా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. షనియల్ డియో అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అడివి శేష్ కొత్త అప్‌డేట్ ఇచ్చాడు. ఈ సినిమా టైటిల్‌ను డిసెంబర్ 18న అనౌన్స్ చేయనున్నట్లు తెలిపాడు. దీనితో పాటు ఒక కొత్త పోస్టర్‌ను పంచుకున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
