Skip to main content

Namaste NRI

అమెరికాలో మరో దారుణం

అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణం జరిగింది. సిగరెట్ వెలిగించుకునేందుకు లైటర్ ఇవ్వలేదని ఓ దుండగుడు రెస్టారెంట్లో పనిచేసే మహిళను కాల్చిచంపాడు. అమెరికాలోని కెంటకీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  ఫ్లోరిడాకు చెందిన 55 ఏండ్ల రాబర్ట్ పాన్నెల్ అనే వ్యక్తి  కెంటకీలోని బెస్ట్ వెస్టర్న్ రెస్టారెంట్‌కు  వెళ్లాడు. అక్కడ పనిచేసి ఓ మహిళా ఉద్యోగినిని పిలిచి సిగరెట్ లైటర్ తీసుకురమ్మని ఆదేశించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్చిచంపాడు. రెస్టారెంట్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పార్కింగ్ లాట్లో దాగి ఉన్నాడని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, మహిళ హత్య అనంతరం పార్కింగ్ లాట్లో కూడా నిందితుడు సిగరెట్ లైటర్ ఇవ్వలేదన్న కారణంతో ఓ జంటపై దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితుడు రాబర్ట్ పాన్నెల్ మెక్క్రాకెన్ కౌంటీ జైల్లో ఉన్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events