
కన్నడ భామ రుక్మిణి వసంత్ తెలుగులో మరో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది.శర్వానంద్ సరసన ఆమె కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో రుక్మిణి వసంత్‌ను కథానాయికగా ఖరారు చేశారని తెలిసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్న ఈ సినిమాలో నాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది.















