Skip to main content

Namaste NRI

అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఇండియా డే పరేడ్‌ కి

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి అరుదైన ఆహ్వానం అందింది. ఆగస్టు 21న న్యూయార్క్‌లో జరిగే వార్షిక ఇండియా డే పరేడ్‌కు ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్‌ నేతృత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఐఏ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది ఘనంగా వేడుకలు జరగబోతున్నాయి. కవాతులో అల్లు అర్జున్‌ గ్రాండ్‌ మార్షల్‌ గా వ్యవహరిస్తారని ఎఫ్‌ఐఏ అధ్యక్షుడు కెన్నీ దేశాయ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌, పలువురు ఇతర ప్రముఖులు కూడా పాల్గొంటారని తెలిపారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో ప్రముఖ గాయకులు శంకర్‌ మహదేవన్‌, కైలాస్‌ ఖేర్‌లు అలరించబోతున్నారని తెలిపారు. అల్లు అర్జున్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల బన్నీ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

Social Share Spread Message

Latest News