Skip to main content

Namaste NRI

మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు కజకిస్తాన్‌ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ నెల 28, 29 తేదీల్లో బ్రిడ్జ్‌ ఫోరమ్‌ సదస్సు జరగనుంది.  ఈ నేపథ్యంలో బ్రిడ్జ్‌ ఫోరమ్‌ సదస్సుకు గౌరవ అతిథిగా రావాలని మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. కజకిస్తాన్‌ వేదికగా జరిగే 2022 డిజిటల్‌ బ్రిడ్జి ఫోరమ్‌ సదస్సు రావాలని ఆహ్వానంలో పేర్కొన్నారు. బిగ్‌ డేటా, క్లౌడ్‌ సొల్యూషన్స్‌, డిజిటల్‌ సేవలపై సదస్సు నిర్వహించనున్నారు.

Social Share Spread Message

Latest News