యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట పెండ్లి సందడి నెలకొంది. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ నేషనల్ అవార్డ్ విన్నర్, కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, తమిళ హీరో ఉమాపతి రామయ్య వివాహబంధంతో ఒక్కటయ్యారు. చెన్నైలోని గెరుగంబాక్కమ్‌లో అర్జున్ కట్టించిన హనుమాన్ ఆలయంలో ఈ పెండ్లి వేడుక జరిగింది.

బంధుమిత్రులు, సన్నిహితులు, ఇండస్ట్రీ స్నేహితుల సమక్షంలో ఐశ్వర్య అర్జున్- ఉమాపతి రామయ్య ఏడ డుగులు వేశారు. సముద్రఖని, విశాల్ తండ్రి జీకే రెడ్డి, కేఎస్ రవికుమార్, నటుడు విజయ కుమార్‌తోపాటు పలువురు తమిళ సినీ ప్రముఖులు ఈ వెడ్డింగ్ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. చెన్నైలోని పాపులర్ ఫైవ్‌స్టార్ హోటల్‌లో రిసెప్షన్ జరుగనుంది.
