
సురేష్ రవి, ఆశా వెంకటేష్ జంటగా నటిస్తున్న చిత్రం చంద్రేశ్వర. జీవీ పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో రవీంద్రచారి నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కానుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాలోని శివుడి గీతాన్ని విడుదల చేశారు. ఆర్కియాలజీ కాన్సెప్ట్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిదని, పురాతన ఆలయాల నేపథ్యంలో కథ నడుస్తుందని నిర్మాత తెలిపారు. శివుడి మీద రూపొందించిన ఈ గీతం సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జెరాడ్ ఫిలిక్స్, దర్శకత్వం: జీవీ పెరుమాళ్ వర్ధన్.
