Skip to main content

Namaste NRI

ఆషిష్ దేత్త‌డి మూవీ ఫ‌స్ట్ లుక్‌

ఆశిష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దేత్తడి. నిర్మాత దిల్‌రాజు.  ఈ చిత్రం ద్వారా ఆదిత్య రావు గంగసాని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హీరో ఆశిష్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌ నేపథ్య కథాంశమిది.ఇక్కడి యువత తాలూకు జోష్‌, వారిదైన ప్రత్యేక కల్చర్‌ను ఆవిష్కరిస్తుంది. ఆద్యంతం చక్కటి వినోదంతో పాటు హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయి. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది.

ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో హీరో ఆశిష్‌ డప్పు వాద్యకారుడి గెటప్‌లో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, రుతమ్‌ స్టోరీ ల్యాబ్‌, నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్‌, దర్శకత్వం: ఆదిత్యరావు గంగసాని.

Social Share Spread Message

Latest News