అంతర్జాతీయ విద్యార్థులకు జారీ చేసే వీసాలను ఆస్ట్రేలియా తగ్గించింది. దీంతో భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. గడిచిన పదేళ్లలో స్టూడెంట్ వీసాల తిరస్కరించిన రేటు తారా స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఆ దేశ హోంశాఖ డేటా ప్రకారం 2026 జూన్‌లో 24.2 శాతం మేర స్టూడెంట్ వీసాలను ఆస్ట్రేలియా తిరస్కరించినట్లు తెలిసింది. 2016 జూన్‌లో 7.9 శాతంగా ఉన్న తిరస్కరణ రేటు, ఇక 2026 జూన్ వరకు అత్యధిక స్థాయికి చేరినట్లు ప్రభుత్వ డేటా ద్వారా వెల్లడైంది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో నేపాల్, ఇండియా స్టూడెంట్ల వీసాలను ఆస్ట్రేలియా అత్యధిక స్థాయిలో తిరస్కరించింది. నేపాల్‌కు చెందిన 51 శాతం మంది విద్యార్థులను వీసాలను, భారత్‌కు చెందిన 40 శాతం మంది విద్యార్థులను వీసాలను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇక చైనా విద్యార్థుల వీసాల తిరస్కరణ రేటు 5.8 శాతం ఉన్నట్లు గుర్తించారు. వలసల అవసరాలకు తగినట్లు చెకింగ్ చేస్తున్నట్లు ఆస్ట్రేలియా చెబుతున్నా, విద్యార్థుల వీసాలపై స్క్రూట్నీ పెరిగినట్లు డేటా ద్వారా తెలుస్తోంది.















