నీటి కొరత నేపథ్యంలో కొలంబియా దేశ రాజధాని బొగోటా ప్రజలకు అక్కడి మేయర్ కార్లోస్ ఫెర్నాండో గలాన్ వింత సూచనలు చేశారు. నీటిని పొదుపు చేసేందుకు గానూ దంపతులు కలిసి స్నానం చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, ఆదివారం లేదా బయటకు వెళ్లేది లేని రోజులను అవకాశంగా తీసుకొని స్నానం చేయ డం కూడా మానుకోవాలని ఆయన సూచించారు. బొగోటాలో ప్రస్తుతం నీటి నిల్వలు చరిత్రలో ఎన్నడూ లేనం త తగ్గిపోయిన నేపథ్యంలో ఒక్క చుక్క నీటినీ వృథా చేయవద్దని, కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవ డం తప్పదని ఆయన పేర్కొన్నారు.