Skip to main content

Namaste NRI

సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌గా భవనమ్‌

సప్తగిరి, ధనరాజ్‌, షకలక శంకర్‌, అజయ్‌, మాళవిక సతీషన్‌, స్నేహా ఉల్లాల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భవనమ్‌. బాలాచారి కూరెళ్ల దర్శకుడు. ఆర్‌.బి.చౌదరి, వాకాడ అంజన్‌ కుమార్‌, వీరేంద్ర సీర్వి నిర్మాత లు. ఈ సినిమా ట్రైలర్‌తో పాటు ఓ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్‌.బి.చౌదరి మాట్లాడుతూ మా సంస్థకిది 95వ చిత్రం. మరో మూడు సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నా యి. త్వరలో 100 సినిమాల మైలురాయికి చేరుకోబోతున్నాం. సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో సాగే హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది అన్నా రు. ఓ భవనం నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్లింగ్‌ అంశాలతో సినిమా సాగుతుందని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో నల్గొండ గద్దర్‌ నర్సన్న పాడిన యాదమ్మ అనే పాట హైలైట్‌గా నిలుస్తుందని సంగీత దర్శకు డు చరణ్‌ అర్జున్‌ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీమోహన్‌ రెడ్డి, సంగీతం: చరణ్‌ అర్జున్‌, రచన, మాటలు, దర్శకత్వం: బాలాచారి కూరెళ్ల.

Social Share Spread Message

Latest News