Skip to main content

Namaste NRI

సౌత్ఆఫ్రికాలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

సౌత్ ఆఫ్రికాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ దేశ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు తెలిపారు. జోహన్‌బర్గ్‌,  కేపేతౌన్, డర్బన్ రాష్ట్రాల్లో సీఎం పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం కలలను సాకారం చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మూడు రాష్ట్రాల్లో ఈనెల 18న నిత్యావసరాల సరకుల పంపిణీ, అనాథ ఆశ్రమాల్లో అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News