Namaste NRI

సింగపూర్‌ తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

తెలంగాణ కల్చరల్‌ సొసైటీ, సింగపూర్‌(టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో జూన్‌ 27 న ఇక్కడి హెల్త్‌ అండ్‌ సైన్సు అథారిటీ (హెచ్‌ఎస్‌ఏ) సమక్షంలో, 11 ఔట్‌ రమ్‌ రోడ్‌ లో ఏర్పాటు చేసిన టీసీఎస్‌ఎస్‌ రక్త దాన శిబిరం-2021 విజయవంతం అయ్యింది. వరుసగా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ రక్తదాన శిబిరాన్ని టీసీఎస్‌ఎస్‌ నిర్వహిస్తుంది. సొసైటీ పిలుపు మేరకు ఎంతో మంది దాతలు స్వఛరేదంగా ముందుకు వచ్చి ఈ శిబిరం లో పాల్గొని రక్త దానం చేశారు.ఈ రక్తదాన సేవ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేసిన వారందరికి సొసైటీ తరపున సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్‌, ప్రధాన కార్యదర్శి బసిక  ప్రశాంత్‌ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేశ్‌, ఉపాధ్యక్షులు భాస్కర్‌ గుప్త నల్లా మరియు ఇతర సభ్యులు, శశిధర్‌ రెడ్డి, ధన్యవాదాలు తెలియచేశారు. 

Social Share Spread Message

Latest News