Skip to main content

Namaste NRI

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఎట్టకేలకు తన పదవి నుంచి తప్పుకున్నారు. మంత్రుల వ్యతిరేకతతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా బోరిస్‌ జాన్సస్‌ తప్పుకున్నారు. జాన్సన్‌ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ 54 మంది మంత్రుల రాజీనామాతో ప్రధాని పదవి నుంచి వైదొలిగేందుకు ఆయన అంగీకరించారు. మరోవైపు నూతన కన్జర్వేటివ్‌ నేత ఎన్నికయ్యే వరకు బోరిస్‌ జాన్సన్‌ ప్రధానిగా కొనసాగుతారు. జాన్సన్‌ తన రాజీనామాను ధ్రువీకరించిన అనంతరం తదుపరి ప్రధానిని నిర్ణయించేందుకు కన్జర్వేటివ్‌ నాయకత్వ ఎన్నికల వివరాలు వెల్లడికానున్నాయి.

Social Share Spread Message

Latest News