తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను లండన్లోని కోవెంట్రీ సిటీ తెలుగు యువత లింగా రవితేజ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఎన్నారై టీడీపీ ప్రెసిడెంట్ వేణు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎన్నారై టీడీపీ వైస్ ప్రెసిడెంట్ చక్రి, ప్రసన్న, జయకుమారు, పూర్ణ, హరి, శ్రీకాంత్, వంశి, భార్గవ్, జేపీ, యశ్వంత్, సందీప్, జగదీశ్, తదితురులు పాల్గొన్నారు.





