అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్’ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిచేశారు. జనవరి 25 నుండి 30 వరకు జరిగిన ఈ ప్రోగ్రామ్ లో రేవంత్ రెడ్డి తో పాటు 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 21వ శతాబ్దంలో నాయకత్వం అనే అంశంపై ఈ ప్రోగ్రామ్ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించారు. అమెరికా లో ప్రస్తుతం తీవ్రమైన చలి ఉంది, ఈ చలి లోనే ముఖ్యమంత్రి శిక్షణా కార్యక్రమం జరిగింది. ప్రోగ్రాం విజయవంతంగా పూర్తిఅయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు విద్యార్థులు అందరికీ ఫ్యాకల్టీ సభ్యులు సర్టిఫికెట్లు అందజేశారు అనంతరం గ్రూప్ ఫోటో దిగారు.


















