
రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రాంరెడ్డి, మధుసూధన్ రెడ్డి ఉన్నారు.

