Skip to main content

Namaste NRI

ఆ దేశం నుంచి వెంటనే వచ్చేయండి ..అమెరికా

రష్యాలోని  తన పౌరులను వెంటనే వచ్చేయండి అంటూ అమెరికా ప్రభుత్వం  అలర్ట్ చేసింది. అక్కడి అమెరికన్లు వెంటనే స్వదేశానికి తిరుగుప్రయాణం ప్రారంభించాలని సూచించింది. రష్యాకు రావాలనుకుంటున్న వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని కూడా తేల్చి చెప్పింది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలెట్టిన రష్యాకు, అమెరికాకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో రష్యాలో అమెరికా పౌరుల భద్రతపై అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. రష్యాలోని అమెరికన్లను అన్యాయంగా అరెస్టు చేసే అవకాశం ఉందంటూ మాస్కోలోని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. గతంలో రష్యాలో కొందరు అమెరికన్లు అన్యాయంగా అరెస్టయ్యారనీ గుర్తుచేసింది. అంతేకాకుండా రష్యన్ అధికారులు చట్టాల సాకుతో అమెరికన్ల న్యాయబద్ధమైన కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారని చెప్పింది. మతపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్లపై అనుమానాస్పద రీతిలో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా నిర్వహిస్తున్నట్టు ఆరోపించింది. అమెరికా ప్రభుత్వం గతేడాది కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేసింది. రష్యాను వీడాలంటూ అక్కడున్న అమెరికన్లను కోరింది .

Social Share Spread Message

Latest News