ఇటీవల మలయాళంలో విడుదలైన 2018 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. టోవినో థామస్, కున్చాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు. 2018 సంవత్సరంలో కేరళలో సంభవించిన వరదలు పెను బీభత్సాన్ని సృష్టించాయి.కేరళ చరిత్రలో శతాబ్దంలోనే అతి పెద్ద వరదలుగా రికార్డుకెక్కాయి. దాదాపు 164 మంది ప్రాణాలను బలిగొన్న ఈ వరదల నేపథ్యంలో 2018 చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల వసూళ్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది. కేరళలోని మారుమూల పల్లెటూరిలో ఈ చిత్ర కథ నడుస్తుంది. ఈ చిత్ర తెలుగు హక్కులను బన్నీ వాసు దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.