Skip to main content

Namaste NRI

త్వరలో తెలుగులోకి 2018

ఇటీవల మలయాళంలో విడుదలైన 2018 చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సాధించింది. టోవినో థామస్‌, కున్చాకో బోబన్‌, వినీత్‌ శ్రీనివాసన్‌, ఆసిఫ్‌ అలీ, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాడ్‌ ఆంథనీ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. 2018 సంవత్సరంలో కేరళలో సంభవించిన వరదలు పెను బీభత్సాన్ని సృష్టించాయి.కేరళ చరిత్రలో శతాబ్దంలోనే అతి పెద్ద వరదలుగా రికార్డుకెక్కాయి. దాదాపు 164 మంది ప్రాణాలను బలిగొన్న ఈ వరదల నేపథ్యంలో 2018 చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల వసూళ్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది.  కేరళలోని మారుమూల పల్లెటూరిలో ఈ చిత్ర కథ నడుస్తుంది. ఈ చిత్ర తెలుగు హక్కులను బన్నీ వాసు దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News