Namaste NRI

దేశంలో భారీ పేలుళ్లకు కుట్ర.. ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్

భారత్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన ఆరుగురు ఉగ్రవాదులను ఢల్లీి స్పెషల్‌ సెల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఢల్లీి, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలోని రద్దీ ప్రదేశాల్లో పేలుళ్లకు వీరు కుట్రపన్నారని ఢల్లీి స్పెషల్‌ సెల్‌ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌ ఠాకూర్‌ తెలిపారు. నవరాత్రుల సమయంలో రామ్‌లీలా మైదానంతో పాటు దుర్గా పూజా మండపాల వద్ద పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని తెలిపారు. ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని ఫామ్‌హౌస్‌లో శిక్షణ పొందారని, ఆర్డీఎక్స్‌ బాంబును అండర్‌వరల్డ్‌ సాయంతో ఢల్లీికి తీసుకువచ్చారని ఠాకూర్‌ తెలిపారు. 1993 తర్వాత ఆర్డీఎక్స్‌ బాంబును రాజధానికి తరలించం ఇదే ప్రథమం.

                దావూద్‌ ఇబ్రహీం సోదరుడు అనీస్‌ ఇబ్రహీం ఆర్డీఎక్స్‌ బాంబును భారత్‌కు తరలించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒసామా, జీషాన్‌కు 15  రోజుల శిక్షణ కూడా అనీస్‌ ఇబ్రహీం ఇప్పించాడని ఠాకూర్‌ తెలిపారు. ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ప్లాన్‌ చేశారని పోలీసులు తెలిపారు. దసరా నవరాత్రులు, ఇతర పండుగల సందర్భంగా మందుపాతరలు, మారణాయుధాలతో విధ్వంసానికి పాల్పడేందుకు కుట్ర జరిగిందన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress