Namaste NRI

డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన దగ్గుబాటి రానా

టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. డ్రగ్‌ కేసు, మనీలాండరింగ్‌ కేసులో హీరో దగ్గుబాటి రానా విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. బ్యాంకు ఖాతాలతో పాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను రానా తన వెంట విచారణకు తీసుకొచ్చారు. ఆడిటర్స్‌, అడ్వకేట్స్‌తో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధాన నిందితుడు కెల్విన్‌తో లావాదేవీలపై రానాను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు కెల్విన్‌ ఎవరో తెలియదని రానా చెప్పినట్లు సమాచారం. మనీ లాండరింగ్‌ కోణంలో 2015 నుంచి 2017 వరకు రానా బ్యాంకు ఖాతాల లావాదేవీలను అధికారులు పరిశీలించి, అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు. ఇక ఎఫ్‌ క్లబ్‌ విషయమై రానాను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్‌ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress