Namaste NRI

ఘనంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలు

మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైటా) దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటాయి. నవంబర్ 9న మలేషియాలో జరిగిన వేడుకల్లో వేలాది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.  ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా త్రిపుర చీఫ్ జస్టిస్ టి. అమర్ నాథ్ గౌడ్, ఇండియన్ హై కమీషనర్ బి.ఎన్. రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాత్, పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు గాదరి కిశోర్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ మొలుగారం, అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య , ఆకునూరి మురళి(రిటైర్డ్ ఐఏఎస్ ) తదితరులు పాల్గొన్నారు. మలేషియా అసోసియేషన్ సభ్యులు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను వక్తలు కొనియాడారు. పది సంవత్సరాల క్రితం స్థాపించబడ్డ ఈ సంస్థ నిర్విరామంగా కొనసాగిస్తున్న సేవా కార్యక్రమా లను, సభ్యులందరినీ అభినందించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి మైటా ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు, మహిళా ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రావు, ట్రెజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, జాయింట్ ట్రెజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రెసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరి ప్రసాద్, మహేష్, శ్రీహరి, అనిల్ రావు, వెంకట్, వినోద్, హరీష్, శశి గీత జీవన్ రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, జ్యోతి నాంపల్లి, సుప్రియ కంటే, మిథున్ శృతి, రాధిక, పూర్ణ లత, నరేందర్ రెడ్డి, రాములు, రమేష్  ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress