
అడివి శేష్ నటిస్తున్న ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ డెకాయిట్. మృణాళ్ ఠాకూర్ కథానాయిక. షానియల్ డియో దర్శకత్వం లో ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తు న్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంలోనే అడివి శేష్, మృణాళ్‌ఠాకూర్ ఇంటెన్స్ లుక్స్‌లో కనిపిస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అందర్నీ ఆకట్టుకున్నాయని, జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించే సినిమా ఇదని మేకర్స్ నమ్మకం వెలిబుచ్చారు. ఈ చిత్రం 2026 ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కానున్నది. బాలీవుడ్ దర్శక, నటుడు అనురాగ్ కశ్యప్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో.
















