Skip to main content

Namaste NRI

శర్వా క్రూషియల్‌ రోల్‌లో డింపుల్‌ హయాతి

చార్మింగ్ స్టార్ శర్వా తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ శర్వా 38ని ప్రారంభించడానికి సిద్ధంగా వున్నారు. హీరో శర్వానంద్‌ కెరీర్‌లో తొలి పానిండియా సినిమాకు రంగం సిద్ధమైంది. సంపత్‌నంది దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న ఈ పానిండియా సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఓ క్రూషియల్‌ రోల్‌ కోసం డింపుల్‌ హయాతిని ఎంపిక చేశారు దర్శకుడు సంపత్‌నంది.

కథలో చాలా కీలకంగా ఈ పాత్ర ఉంటుందని, ఈ పాత్రకు డింపుల్‌ పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని మేకర్స్‌ చెబుతున్నారు. 1960లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన యధార్థ గాధ ఆధారంగా ఈ సినిమా రూపొందనున్నది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామని, తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సినిమాను విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: లక్ష్మీ రాధామోహన్‌.

Social Share Spread Message

Latest News