Skip to main content

Namaste NRI

ప్యాషన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల

యంగ్ ట్యాలెంటెడ్ హీరో హీరోయిన్స్ సుధీస్, అంకిత జంటగా, అరవింద్ జాషువా దర్శకత్వంలో రూపొందుతున్న ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ ప్యాషన్. రెడ్ యాంట్  క్రియేషన్ బ్యానర్‌పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతమైన డిజైన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తప్పకుండా గొప్ప విజయం సాధిస్తుందని శేఖర్ కమ్ముల ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫస్ట్ లుక్ లాంచ్ ప్రెస్ మీట్‌లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ అరవింద్ జాషువాతో నాకు ఆనంద్  సినిమా నుంచి పరిచయం. అప్పట్లోనే అతనిలో స్టోరీ టెల్లింగ్, రైటింగ్, క్రియేటివిటీ ఉన్నాయని గుర్తించాను. అరవింద్ రాసిన ప్యాషన్ నవల చదివాను, అద్భుతంగా ఉంది. ఫ్యాషన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అతను ఈ కథను చాలా అథెంటిక్‌గా రాశాడు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది, అరవింద్‌కు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. నిర్మాతలు కొత్తవాళ్లైనా, వారంతా ప్యాషన్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చాలా బాగుంది. కొత్త ఫ్లేవర్‌తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమా కూడా అద్భుతంగా ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను. టీమ్‌కు నా శుభాకాంక్షలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధీస్, అంకిత, ప్రకాష్ రాజ్, హిమజ, అశ్విన్ ముశర్న్, బెనర్జీ, చందన, అర్చన, ఉదయ్ మహేష్, సూర్య, కన్నడ కిషోర్, యుక్త, అర్జున్, శ్రేయషి, పరిణిత, అన్షుల, అంకిత్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events