Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్​పై మరోమారు…. గోల్ఫ్‌ ఆడుతుండగా!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఆయన గోల్ఫ్‌ ఆడుతుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపేందుకు విఫలయత్నం చేశాడు.  ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌ వద్ద ఉన్న ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ గోల్ఫ్‌ కోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. రక్షణ కంచె వద్ద నుంచి దుండగుడు ట్రంప్‌ లక్ష్యంగా ఏకే-47 తుపాకీ గురిపెట్టాడు. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు దుండగు డిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు కారులో పారిపోగా, ఏజెంట్లు వెంబడించి అరెస్టు చేశారు. ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం రెండు నెలల్లో ఇది రెండోసారి. జూలైలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌ పట్టణంలో థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ అనే యువకుడు ట్రంప్‌పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

Social Share Spread Message

Latest News