
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్, కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా పలు సంక్షోభాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించానని మరోసారి ప్రకటించుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఘర్షణకు సంబంధించి మరోసారి అదే మాట మాట్లాడిన ఆయన, ఆ రెండు దేశాలు అణుయుద్దం వరకు వెళ్లాయన్నారు. ఆ సమయంలో 67 విమానాలు నేల కూలాయాన్న ట్రంప్, రెండు దేశాల ఘర్షణను తామే పరిష్కరించినట్టు చెప్పారు. ఇలా గత ఆరు నెలల్లో ఆరు యుద్ధాలను ఆపానంటూ వైట్‌హౌస్‌లో వెల్లడించారు. ఆరు నెలల వ్యవధిలో ఆరు యుద్ధాలను ఆపాను. అందుకు నేను చాలా గర్వపడుతున్నా. భారత్-పాక్‌ల విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లాయి. 6 నుంచి 7 విమానాలు నేల కూలాయి. అలా ఆ రెండు దేశాలు అణుయుద్ధానికి సిద్ధమవగా, వాటిని మేమే పరిష్కరించాం అని ట్రంప్ పేర్కొన్నారు.
















