వరుణ్‌సందేశ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం నింద. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రాజేష్ జగన్నాథం తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్ తదితరులు నటిస్తున్నారు. కాండ్రకోట అనే ప్రదేశంలో జరిగిన యథార్థ సంఘట నల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిం చారు. ఈ చిత్ర టీజర్‌ను నవీన్‌చంద్ర విడుదల చేశారు. జీవితంలో కొన్నిసార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు అనే సంభాషణతో మొదలైన టీజర్ ఎన్నో మలుపులతో ఆకట్టుకుంది.
ప్రేమకథతో పాటు మర్డర్, క్రైమ్, మిస్టరీ అంశాలతో ఉత్కంఠను పంచింది. విజువల్స్ మెప్పించాయి. కాండ్రకోటలో జరిగిన అనూహ్య సంఘటనల నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్‌గా మెప్పిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రమీజ్ నవీత్, సంగీతం: సంతు ఓంకార్, రచన-దర్శకత్వం: రాజేష్ జగన్నాథం.