శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్, ఆర్.కార్తికేయ, ఇందుప్రియ, ప్రియ వల్లభి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం దోస్తాన్. సూర్య నారాయణ అక్కమ్మ గారి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కె.బసిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహం నేపథ్యంలో తరతరాలుగా సినిమాలు రూపొందుతున్నాయి. గొప్పదైన ఆ బంధం చుట్టూ సాగే ఈ సినిమా కూడా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని నమ్ముతున్నా అన్నారు. దర్శక నిర్మాత మాట్లాడుతూ స్నేహమే జీవితం అనుకున్న ఇద్దరు యువకుల కథ ఇది. కథానాయకుడు సిద్ స్వరూప్ రాసిన కథతో ఈ సినిమా చేశా. పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాద పద్మిని నాగులపల్లి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, మూసా అలీ ఖాన్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.















