Skip to main content

Namaste NRI

దోస్తాన్‌ టీజర్‌ విడుదల

శ్రీ సూర్య మూవీస్‌ క్రియేషన్స్‌ పతాకంపై  సిద్‌ స్వరూప్‌, ఆర్‌.కార్తికేయ, ఇందుప్రియ, ప్రియ వల్లభి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం దోస్తాన్‌. సూర్య నారాయణ అక్కమ్మ గారి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.  తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కె.బసిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్నేహం నేపథ్యంలో తరతరాలుగా సినిమాలు రూపొందుతున్నాయి.  గొప్పదైన ఆ బంధం చుట్టూ సాగే ఈ సినిమా కూడా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని నమ్ముతున్నా అన్నారు. దర్శక నిర్మాత మాట్లాడుతూ స్నేహమే జీవితం అనుకున్న ఇద్దరు యువకుల కథ ఇది. కథానాయకుడు సిద్‌ స్వరూప్‌ రాసిన కథతో ఈ సినిమా చేశా. పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. లంబసింగి, తలకోన, వరంగల్‌, హైదరాబాద్‌, విశాఖపట్నం, కాకినాడ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాద పద్మిని నాగులపల్లి,  తుమ్మలపల్లి రామ సత్యనారాయణ,  మూసా అలీ ఖాన్‌తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News