Skip to main content

Namaste NRI

భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఘన విజయం

 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై ఘన విజయం సాధించి భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశంలో అత్యున్నత పీఠాన్ని దక్కించుకున్న తొలి  ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము నిలిచారు.  మూడో రౌండ్‌ ముగిసేసరికి ఆమెకు 2161 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 5,77,777. మరోవైపు విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మూడో రౌండ్‌ ముగిసేసరికి ఆయనకు 1058 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 2,61,062. సగానికి పైగా ఓట్లు సాధించిన ముర్ము  ప్రత్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ నెల 25న దేశ 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేస్తారు.

Social Share Spread Message

Latest News