Namaste NRI

న్యూయార్క్ లో అత్యవసర పరిస్థితి

అమెరికాలోని న్యూయార్క్లో వలసల సంక్షోభం నెలకొంది. దీంతో ఆ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అత్యవసర పరిస్థితిని విధించారు. రిపబ్లికన్ పాలిత రాష్ట్రాలైన టెక్సాస్, అరిజోనా, ఫ్లోరిడా నుంచి డెమోక్రటిక్ రాష్ట్రాలకు వలసలు పెరిగిపోయాయి. సెప్టెంబర్ నుంచి ప్రతిరోజూ శరుణార్థులతో కూడిన 5`6 బస్సులు న్యూయార్క్లో ప్రవేశిస్తున్నాయని ఆడమ్స్ తెలిపారు. నగర షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న వారిలో ప్రతి ఐదుగరిలో ఒకరు శరణార్థులేనని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దక్షిణ సరిహద్దు గుండా నగరంలోకి 17 వేల మందికి పైగా వలస వచ్చారు. వలస వచ్చే వారిలో చిన్నారులు, వైద్యసేనలు అవసరమున్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వారందరినీ ఆదుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో తమకు రూ.వంద కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఈ వలసల వల్ల ఇతర పనులకు వెచ్చిందేందుకు నిధులు లేకుండా పోయాయని వెల్లడిరచారు. కావాలనే రిపబ్లికన్ రాష్ట్రాల నుంచి జనాలను ఇక్కడికి పంపిస్తున్నారని ఆరోపించారు. నగర సామాజిక సేవలను కొందరు రాజకీయ లద్ది కోసం వాడుకుంటున్నారని రిపబ్లికన్ పార్టీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events