Skip to main content

Namaste NRI

రష్యాపై ఈయూ దేశాలు కొత్త నిర్ణయం

రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసే అంశంలో ఈయూ దేశాలు కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాయి. బ్రస్సెల్స్‌లో జరిగిన ఈయూ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. రష్యా నుంచి దిగుమతి అవుతున్న ఇంధనంలో రెండిరట మూడవ వంతును ఆపేయాలని ఆ దేశాలు భావించాయి. సముద్ర మార్గంలో వచ్చే ఇంధన దిగుమతిపై బ్యాన్‌ విధిస్తున్నట్లు ఈయూ చెప్పింది. కానీ పైప్‌లైన్‌ ద్వారా సరఫరా అవుతున్న ఇంధన దిగుమతి కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల హంగేరికి ఊరట కలిగింది. ఈ ఆంక్షల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు యురోపియన్‌ కౌన్సిల్‌ చీఫ్‌ చార్లెస్‌ మైఖేల్‌ తెలిపారు. ఆరవ ఆంక్షల ఫ్యాకేజీపై 27 సభ్య దేశాలు అంగీకరించినట్లు ఆయన వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News