Skip to main content

Namaste NRI

ఈ సినిమా క్లైమాక్స్ చూసి అందరూ షాక్ అవుతారు : దర్శకుడు తుకారం

వర్ధన్‌, కృష్ణప్రియ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ కాగితం పడవలు. ఎంజీఆర్‌ తుకారం దర్శకుడు. కీర్తన నరేశ్‌, టీఆర్‌ ప్రసాద్‌రెడ్డి వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మాతలు. ఈనెల 18న ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. తాము కష్టపడి చేసిన ఈ సినిమాను, ప్రేక్షకులంతా ఇష్టపడి చూస్తారని ఆశిస్తున్నామని హీరో వర్ధన్‌ అన్నారు.

ఈ సినిమా క్లైమాక్స్ అందర్నీ షాక్‌కి గురిచేస్తుందని దర్శకుడు తుకారం తెలిపారు. సినిమాలో భాగం కావడం పట్ల కథానాయిక కృష్ణప్రియ ఆనందం వెలిబుచ్చారు. కథపై ఉన్న నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించామని నిర్మాతలు అంజనప్ప, కీర్తన తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రుద్రసాయి, సంగీతం: ఏఐఎస్ నౌఫల్‌ రాజా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events