కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతోంది. తాజాగా ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో వుంచుకుని అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించింది కేంద్రం. జులై 31తో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ముగియనుండటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది.
