Skip to main content

Namaste NRI

పెద్ది ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ అప్‌డేట్ వచ్చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది చివరకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో ఘనంగా విడుదల కానుంది.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో మేకర్స్ కూడా విడుదలను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. పెద్ది ట్రైలర్ ఈ మే 17 లేదా 18న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత ఇక మూవీ ప్ర‌మోష‌న్స్ వేగం పెంచుతారు. మ‌ధ్య మ‌ధ్య‌లో మూవీకి సంబంధించిన పాట‌లు, గ్లింప్స్ వ‌దులుతూ సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.

చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే శివ రాజ్‌కుమార్, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ, జగపతి బాబు వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ స్టార్ కాస్టింగ్ సినిమాపై మరింత హైప్‌ను పెంచుతోంది. మరో ముఖ్య ఆకర్షణగా నిలిచేది సంగీతం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆయన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేకమైన హైలైట్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో భావోద్వేగాలు, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ కలగలిపి రూపొందుతున్న పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజ‌యం సాధిస్తుందా అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events