దేశ ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఐటీ మద్రాస్ స్పోర్ట్స్ కోటా అమలు చేయనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రతి యూజీ కోర్సులో రెండు సీట్లను అత్యుత్తమ క్రీడాకారులకు కేటాయించ నుంది. ఇందులో ఒకటి జనరల్-న్యూట్రల్‌కు, ఒకటి మహిళలకు కేటాయిస్తామని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి తెలిపారు. స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అడ్మిషన్(ఎస్‌ఈఏ) కార్యక్రమం ద్వారా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సూపర్ న్యూమరరీ సీట్ల ద్వారా ప్రవేశం కల్పించి ప్రోత్సహిస్తాం. అని ఆయన వెల్లడించారు.
