Skip to main content

Namaste NRI

ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా

దేశ ఐఐటీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐఐటీ మద్రాస్‌ స్పోర్ట్స్‌ కోటా అమలు చేయనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రతి యూజీ కోర్సులో రెండు సీట్లను అత్యుత్తమ క్రీడాకారులకు కేటాయించ నుంది. ఇందులో ఒకటి జనరల్‌-న్యూట్రల్‌కు, ఒకటి మహిళలకు కేటాయిస్తామని ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ కామకోటి తెలిపారు.  స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ అడ్మిషన్‌(ఎస్‌ఈఏ) కార్యక్రమం ద్వారా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సూపర్‌ న్యూమరరీ సీట్ల ద్వారా ప్రవేశం కల్పించి ప్రోత్సహిస్తాం. అని ఆయన వెల్లడించారు.

Social Share Spread Message

Latest News